15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వెదిర సర్పంచ్ కు సన్మానం

10-01-2026 12:47 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రామడుగు మండలంలోని వెదిర గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్ ను, ఉప సర్పంచ్ దుగ్యాల రాజిరెడ్డిని వాగేశ్వరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిని సర్పంచిగా ఎన్నుకున్న వెదిర గ్రామ ప్రజల నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.

గ్రామాన్ని అన్ని రంగాల్లో విద్య, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం మరియు ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసే సామర్థ్యం కలిగి వ్యక్తి అని, అంతే కాకుండా ప్రజల సహకారం, ఐక్యతతో గ్రామం మరింత ప్రగతి సాధిస్తుందని, ప్రజాప్రతినిధులు మరియు విద్యాసంస్థలు కలిసి పనిచేస్తే సమాజాభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు.తదుపరి  సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరి సహకారంతో వెదిర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వాగేశ్వరి కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ చెన్నోజు రమణ చారి , ఎ ఓ వేదవ్యాస్, మనోజ్, పెద్దపల్లి సాయి పాల్గొన్నారు.