calender_icon.png 11 January, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతకాలం కలంపై జులుం..?

10-01-2026 12:45:29 PM

జర్నలిస్టు పై తిట్ల దండకం 

వాట్సాప్ గ్రూపులో వైరల్..

కాంగ్రెస్ నేత తీరు పై చర్చ ..

వాస్తవాలు జీర్ణమవుతలేవు..

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ఎచ్చులకు పోయి ఎల్లలికిలా పడినట్టు జర్నలిస్టును తిట్టి, బెదిరించి కేసుల పాలైనా ఓ అపర మేధావి, సీనియర్ కాంగ్రెస్ నేత ఉదంతమిది. బెల్లంపల్లిలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏమిచేసినా అందరూ సినిమా చూసినట్టు ఉండాలి. జర్నలిస్టులు కూడా ఏమి రాయద్దూ..ఇది బెల్లంపల్లి లో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులశైలి... ఇలా తలచిన కాంగ్రెస్ నేత రామచందర్ కు చెంప పెట్టు అయింది. ఈ రోజుల్లో నిజాలు చెప్పడం, రాయడం పెద్ద  తప్పయిపోయింది. బెల్లంపల్లి ఎమ్మేల్యే గడ్డం వినోద్ ప్రధాన అనుచరుడు, బెల్లంపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామచందర్ ఓ రిపోర్టర్ పై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి.

ఆ రిపోర్టర్  చేసిన పెద్ద నేరం అతను పని చేస్తున్న టీవీ చానెల్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై వ్యతిరేక కథనం రావడమే. దానికి అతన్ని  టార్గెట్ చేశాడు. నిజానికి ఆ వార్త రాసింది. స్టాఫ్ రిపోర్టర్. సరే ఎవరూ రాసిందనేది ప్రధానం కాదు ఇక్కడ. ప్రజా ప్రతినిధులపై స్థల కాలాల భౌతిక పరిస్థితుల నేపథ్యంగా అనుకూల, వ్యతిరేక కథనాలు మీడియాలో రావడం సహజమే. ఈ విషయాన్ని పరిపక్వత లేని చోటా మోటా నాయకులకు తెలీదు. తాము అధికార పార్టీలో ఉన్నాం కనుక  తమకే వ్యతిరేకంగా రాస్తారా.? అనే అహంకారం తలకెక్కి నోరుపారేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే బెల్లపపల్లిలో కాంగ్రెస్ నేత రామచందర్ కూడా ఇక్కడే పప్పులో కాలేసిండు. వార్తా కథనాన్ని మనసులో పెట్టుకుని సదరు జర్నలిస్టును తీవ్రంగా దూషించి ప్రజల్లో అప్రతిష్ట పాలయ్యారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్లు బండ భూతులతో ఆ జర్నలిస్టును దూషించారు.

అంతేకాకుండా నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు అక్కడికి వచ్చేసి నీఅంతు చూస్తానని, చంపేస్తానని మరి బెదిరింపులకు దిగడం జిల్లాలో కలకలం రేపింది. ఒక జర్నలిస్టును పట్టుకుని రోడ్డు మీద బట్టలూడదీసి కొడతానా నాకొడకా అని  స్టేట్ లీడర్ లా నోటికి వచ్చినట్టు తిట్ల పురాణం అందుకుంటే, ఇక సామాన్య ప్రజల సంగతి ఎలా ఉంటదనేది ఊహకందని విషయం కాదు. అధికార పార్టీ లీడర్ల పనితీరును  ఇంత అనైతికంగా  నిర్లజ్జoగా, నీతి బాహ్యంగా తయారైందడానికి బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేత రామచందర్ వ్యవహారమే పెద్ద ఉదాహరణ. కాగా రిపోర్టర్ ను తిట్టిన ఆ లీడర్ వాయిస్ వీడియో రికార్డు సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఆడియో,వీడియోను అందరూ చూసి, విని అవాక్కయి పోతున్నారు. అంతేకాకుండా స్దానిక వాట్సప్ గ్రూపుల్లోఈ వార్త తెగ వైరల్ అవుతున్నది. అది విన్న ప్రజలు ఆయన వ్యవహారశైలిని చూసి చీకొడుతున్నారు.

ఎమ్మెల్యే పట్ల తమ ప్రభుప్రభుభక్తి,అభిమానాన్ని చాటుకోవడానీ ఇదే సందర్భాన్ని ఎంచుకున్నట్టు అందరూ చర్చించుకుంటున్నారు. రిపోర్టర్లపై ఇలా నోరు పారేసుకుని అటు ప్రజల్లో వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్ పార్టీనీ ఇరకాటంలో పడేసిన ఆయన వ్యవహారం వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్  పెద్ద లీడర్ల కు తల లు పట్టుకుంటున్నారు.  జర్నలిస్టును తిట్టి ఎరక్క పోయి ఇరుకున్నట్టు అయింది. ఆ లీడర్ పరిస్థితీ. ఈ సంఘట పై ఒక్క సారిగా బెల్లపల్లిలో రగడ చెలరేగింది. జర్నలిస్టుల పై కాంగ్రెస్ నేత రౌడీయిజంపై నిరసన  బద్దలయింది. జర్నలిస్టు ను తిట్టిన నేతకు ఇదో చేదనుభవంగా చవిచూడక తప్పలేదు. ఇలా ఆదికార పార్టీ నేతలు సమాజంలో కాసింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లేకపోతే జర్నలిస్టుల తో పెట్టుకుంటే  ఇలానేగే ఉంటుంది. జర్నలిస్టుల పై  సదరు నేత తీరుపై పోలీసులకు ఫిర్యాదు, ఆందోళనకు దిగడం ఈ పరంపలో కాంగ్రెస్ నేత రామచందర్ పరువు బజార్లో పడింది. తొలుత నోరు పారేసుకున్న నేత యూటర్న్ తీసుకుని కాంప్రమైజ్ కోసం మంతనాలకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమాజంలో ఆయనకు కనీసం మద్దతు లేకుండా పోయింది.ఈ సంఘట  పై కేసు పెట్టే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రధాన అనుచరుడు గా చలామణి లో ఉన్న రామచందర్ చేసిన తప్పిదం విషయంలో కేసు నమోదు చేసి నిక్కచ్చిగా పోలీసులు వ్యవహరించడం నిజంగా అభినందనీయం.