గురుద్వారాలో వీరబాల్ దివస్
27-12-2025 07:49 PM
నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ గురుద్వార్‌లో నిర్వహించిన వీర బాల్ దివస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ... సిక్కు చరిత్రలో వీర బాల్ దివస్‌కు ఉన్న గొప్ప ప్రాముఖ్యతను తెలిపారు. చిన్న వయసులోనే ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్జాదాల వీరత్వం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. వారి త్యాగాలు దేశభక్తి, ధైర్యసాహసాలకు చిరస్మరణీయ ప్రతీకలని పేర్కొన్నారు.






