calender_icon.png 27 December, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిచ్చి మొక్కల తొలగింపు

27-12-2025 07:44:15 PM

వాంకిడి,(విజయక్రాంతి): బంబార గ్రామ పంచా యతీ పరిధిలోని గొల్లగూడకు వెళ్లే మెయిన్ రోడ్డు పక్కన గల పిచ్చి మొక్కలను సర్పంచ్ బెండరే కృష్ణాజి ఆధ్వర్యంలో శనివారం తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తన ధ్యేయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

చెత్త చెదరాన్ని ఎక్కడ పడితే అక్కడ వెయకూడదని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.