వీరభద్రుడు.. గాడ్ మోడ్!
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘వీరభద్రుడు’. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ విడుదలైంది. మంచి స్పందన దక్కించుకుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి గాడ్ మోడ్ సాంగ్ రిలీజ్ చేశారు.
సాయి అభ్యంకర్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, కాలభైరవ ఆలపించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీత సారథ్యం వహిస్తుండగా, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా అన్బరివ్ విక్రమ్ మోర్, ఎడిటర్‌గా ఆర్ కళైవానన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అరుణ్ వెంజారామూడు పనిచేస్తున్నారు.




