6 June, 2026 | 4:56 PM

గ్రంథాలయ ఛైర్మన్‌గా వీరబోయిన గంగరాజు యాదవ్

06-06-2026 03:49 PM

తుంగతుర్తి(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్రంథాలయ చైర్మన్ గా వీరబోయిన గంగరాజు యాదవ్ నియమాకమయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సామేలు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గంగరాజు యాదవ్ మాట్లాడుతూ.... గ్రంథాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు రేగటి రవి, దాసరి శ్రీను, కలకోట్ల మల్లేష్, మాచర్ల అనిల్, కొండ రాజు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.