పాదయాత్రకు భయపడే పర్యటన చేశావ్
రెండున్నర యేండ్లు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం
ప్రాజెక్టులు పూర్తిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు
చేసింది చెబుతున్నాం చేయాల్సింది చేయండి
విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రాజెక్టుల పనులు చేపట్టకపోతే పాదయాత్ర చేస్తామని ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల పర్యటన చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పటై రెండున్నర సంవత్సరాలు నిరీక్షించామని ఇప్పటికీ ఏం చేయలేకపోతేనే ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
నార్లపుర్ నుండి ఉద్దండాపూర్ వరకు సంవత్సరంలోపు పూర్తి చేస్తామని, మా ప్రభుత్వం ఉంటే ఆరు నెలల్లో కరివెన వరకు నీళ్ళు తీసుకువచ్చే వాళ్ళంమన్నారు. అన్ని పనులు చేసాక మిగిలిన పనులు చేయడానికే ఇంకో ఏడాది అంటున్నారని, పాలమూరు ప్రాజెక్ట్ కు 27000 వేల ఎకరాలు భూసేకరణ చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ భూసేకరణ చేయలేదనడం హాస్యాస్పదమని,కాలువలకు బీఆర్ఎస్ పిలిచిన టెండర్లను రద్దు చేశారని తెలిపారు. కేసీఆర్ ఎంపీగా ఉండి జిల్లాకు ఏం చేయలేదనడం ఏంటనిల్, డెబ్బై ఏండ్ల పాలనలో పాలమూరును వలసల జిల్లాగా పేరు తెచ్చారని పేర్కొన్నారు.
మా జిల్లా ప్రాజెక్టులు అంటేనే పెండింగ్ ప్రాజెక్ట్ లుగా మార్చారని, బీఆర్ఎస్ వచ్చాక ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఈ జిల్లాను బాగు చేయాలని కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరులోనే శంఖుస్థాపన చేశారని పేర్కొన్నారు. అనేక కేసులు వేసి అడ్డుకున్నారని,రైతులను భూములు ఇవ్వొద్దని రెచ్చగొట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ తొంభై శాతం పూర్తి చేశామన్నారు. వలసల జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాల నుండే ఇక్కడికి వలస వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ రెండున్నర ఏండ్లలో ఏం చేయకుండా.. మేం ఏం చేయలేదు అంటున్నారన్నారు.
ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం,గ్రామస్తులను ఒప్పించి పనులు ప్రారంభించామని, మూడు ప్యాకేజీలు రూ 5500 కోట్లు కేటాంచామని, నాలుగు వేల కోట్లు అప్పటికే రిలీజ్ చేశామన్నారు. ఉద్దండాపూర్ రైతులకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని లేట్ గా స్టార్ట్ చేశామని,2019 లో పనులు ప్రారంభించినం...అందులో రెండేళ్లు కరోనా ఉందన్నారు. రెండేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినమని,రెండున్నర ఏండ్లలో ఆరు వందల కోట్లు పరిహారం ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. మేము చేసిన పని ఏంటో జిల్లా మీడియాకు చూపిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్ నాయకులే కారణమని, బీఆర్ఎస్ రిజర్వాయర్ లు కట్టిందన్నారు.
మేము ఉద్యమ నాయకులం.. తెలంగాణ రాష్ట్రం కోసం ,తెలంగాణ పునర్నిర్మాణం కోసం పని చేశామని తెలిపారు. ప్రభుత్వం మంచిపని చేస్తే సహకరిస్తామని, కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం ఏమైందన్నారు. ఇప్పుడు జెండా ఎగరనివ్వను అంటున్నారు..అదంతా ప్రజలు చూసుకుంటారు..ఎవరి జెండా ఎగరాలో ప్రజలు నిర్ణయిస్తారు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టి తీయలేదని, కాంగ్రెస్ కేసులు వేయించింది. అధికారంలోకి వచ్చాక పనులు పెండింగ్ పెట్టిందన్నారు.
కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేసిందని,జడ్చర్ల లో సభ పెడితే సీఎం ఏదైనా ఇస్తారని ఆశించారన్నారు. జడ్చర్లకు,జిల్లాకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. సభలో కేసీఆర్ ను తిట్టడానికి సరిపోయిందని ల్, ఇందుకేనా సభ పెట్టిందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,చిట్టెం రామ్మోహన్ రెడ్డి,అంజయ్య యాదవ్, మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు వాల్య నాయక్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.






