1 August, 2026 | 5:51 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

కూరగాయల సాగు చేపట్టాలి

12-06-2026 12:36 AM

మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పంట మార్పిడి చేసి, 50 ఎకరాల్లో కూరగాయల పంటల సాగు చేపట్టాలని జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న కోరారు. గురువారం కురవి, డోర్నకల్, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూరుకు సంబందించిన రైతు ఉత్పత్తి కంపనీ లకు ప్రతీ ఒక్క స్వయం సహాయక సంఘం ద్వారా 50 ఎకరాలలో పంట మార్పిడి చేపట్టేందుకు, మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో అవగాహన కార్యక్రమాలు ని ర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎల్నినో, మారుతున్న వాతావరణ పరిస్తితులలో టమోటా, వంగ, పచ్చి మిరప, దోస, బీర, సొర, గోరు చిక్కుడు, బెండ, ఆకు కూరలు, మునగ, షేడ్ నెట్స్ క్రింద టమాట, కీర మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని కోరారు.

కూరగాయల పంటల సాగుకు  ఎకరానికి రూ.21 00,  అంతర పంటల సాగుకు, కూరగాయ ల శాశ్వత పందిరి నిర్మాణానికి ఎకరానికి లక్ష రూపాయల రాయితీ, ఎకరానికి రూ.10,00 0, కూరగాయల నారు మొక్కల సరఫరా, కూరగాయల చిరు సంచుల పంపిణీ వంటి పలు రాయితీ సౌకర్యాలు సద్వినియోగం చే సుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెర ట్లో, ఆయిల్ పామ్, ట్రెల్లిస్ మెథడ్‌లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి స్రవంతి, ఐకేపీ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్, సభ్యులు పాల్గొన్నారు.