భారీ వర్షంతో అంగడి ఆగం ఆగం.!
వరదకు కొట్టుకుపోయిన కూరగాయలు.
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో మంగళవారం సంత కావడంతో వ్యాపారులు, రైతులు కూరగాయల విక్రయానికి భారీగా తరలివచ్చారు. అయితే అకస్మాత్తుగా భారీ వర్షం(Heavy rain) కురవడంతో నీరు వరదతో ఉప్పొంగింది. దీంతో పాటు సమీపంలో ఉన్న మురికి కాలువలు కొన్ని ప్రవహించాయి. కూరగాయలు వరదల్లో కొట్టుకోవడంతో వ్యాపారులు రైతులు ఆందోళన గురయ్యారు. విషయం గమనించిన వార్డు సభ్యులు సోహెల్ తక్షణమేగ్రామ పంచాయతీ సిబ్బందిని(Gram Panchayat staff) పిలిపించి, కాలువలను శుభ్రం చేయించారు. కాగా పంచాయతీ వారు తైబజారు వేలం వేసి డబ్బులు దండుకుంటున్నారే తప్ప తమ గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కాగా పాత బజారుకు ముంగడి స్థలాన్ని మార్చిదేనే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిసారి వర్షం కురిసిందంటే వ్యాపారం నష్టపోతున్నారు.