17 June, 2026 | 3:26 AM

వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరి

17-06-2026 02:17 AM

అలంపూర్, జూన్ 16: విద్యాసంస్థల యాజమాన్యాలు తమ పాఠశాల వాహనాలకు ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలని జిల్లా రవాణా అధికారి (డీటీవో) రాధిక సూచించారు. మంగళ వారం అలంపూర్ నియోజకవర్గంలో పలు  పాఠశాల వాహనాలను తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పాఠశాల బస్సులకు ప్రత్యేక ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

వాహనాల బ్రేకులు, టైర్లు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అన్ని విద్యాసంస్థలు రవాణా శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. కార్యాలయంలో కానిస్టేబుల్ గోవర్దన్ సిబ్బంది పాల్గొన్నారు