17 June, 2026 | 3:09 AM

వేధింపులకు గురిచేస్తే షీ టీమ్‌ను ఆశ్రయించండి

17-06-2026 02:16 AM

జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి

కాసిపేట (బెల్లంపల్లి), జూన్ 16 : పని స్థలాల్లో మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే షీ టీమ్స్ను ఆశ్రయించా లని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి పేర్కొన్నారు. మంగళ వారం కాసిపేట మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలకు షి టీం పోలీసులు మహిళల భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్ ఐ మాట్లాడారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఈవ్టీజింగ్, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియమా లు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై అవగాహన కల్పించారు.

మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించా లని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ (6303923700), మంచిర్యాల జిల్లా షీ టీమ్ (8712659385)లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బం ది, కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, ఫీల్ అసిస్టెంట్ లక్ష్మణ్తో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.