3 August, 2026 | 2:41 PM

డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు ఊరట

03-08-2026 02:09 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌(former BJP MP Brij Bhushan Sharan Singh)కు  ఊరట లభించింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసినలైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ ను ఢిల్లీ కోర్టు సోమవారం నిర్దోషిగా విడుదల చేస్తూ ఆయనపై వచ్చిన అభియోగాలను కొట్టివేస్తూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) అశ్విని పన్వార్ తీర్పును వెలువరించారు. దీనికి సంబంధించిన సమగ్ర ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి, ఆ తర్వాత కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.