3 August, 2026 | 2:45 PM

బీజేవైఎం ఐటీ సెల్ కన్వీనర్‌గా గాండ్ల రాజేందర్

03-08-2026 02:14 PM

రామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల బీజేవైఎం ఐటీ సెల్, సోషల్ మీడియా కన్వీనర్‌గా గాండ్ల రాజేందర్‌ను సోమవారం నియమించారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇసాయిపేట నరేష్ నియామక పత్రాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు ఐటీ సెల్, సోషల్ మీడియా విభాగంలో సమర్థవంతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.