3 August, 2026 | 2:38 PM

తప్పిన భారీ ప్రమాదం: రైలు ఇంజిన్‌లో అగ్నిప్రమాదం

03-08-2026 02:06 PM

బుదౌన్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బుదౌన్ జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం(Fire breaks out) తప్పింది. బరేలీ-కాస్‌గంజ్ రైలు మార్గంలో సోమవారం ఒక ప్యాసింజర్ రైలు ఇంజిన్‌లో(Passenger Train Engine) అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేశారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సుమారు గంట సేపటి తర్వాత మంటలను ఆర్పేశామని సర్కిల్ ఆఫీసర్ (సిటీ) రాహుల్ పాండే తెలిపారు. కాస్‌గంజ్ నుండి బరేలీకి వెళ్తున్న 55328 నంబర్ రైలు ఇంజిన్ వైరింగ్‌లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ, మంటలు వెలువడిన ఘటన బినవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.