పాతదామరాజపల్లిలో గ్రామసభ
03-08-2026 02:12 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని పాతదామారాజపల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ రోడ్ల రాజేశ్వరి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామంలో మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలువంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇప్పపెల్లి గణేష్, గ్రామ కార్యదర్శి సౌజన్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






