1 June, 2026 | 1:48 AM

కరాటే గ్రేడింగ్‌లో వేములవాడ విద్యార్థుల ఘనత

01-06-2026 12:09 AM
  1. పది మందికి బ్లాక్ బెల్ట్, 3 బ్రౌన్ బెల్టులు కైవసం
  2. సిపీ గౌస్ ఆలం ప్రత్యేక అభినందనలు

వేములవాడ, మే 31( విజయక్రాంతి )ఉమ్మడి జిల్లా స్థాయి బ్లాక్ బెల్ట్ కరాటే గ్రేడింగ్ పరీక్షల్లో వేములవాడ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. కరీంనగర్ పట్టణంలోని వివేకానంద స్కూ ల్లో శనివారం సాయంత్రం ఒకినావా మా ర్షల్ ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ గ్రే డింగ్ టెస్ట్ నిర్వహించారు. వేములవాడ ఒకినావా స్పోరట్స్ కరాటే అకాడమీ మాస్టర్ అ బ్దుల్ మన్నన్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ పరీక్షల్లో అద్భుత ప్ర దర్శన చేశారు. మొత్తం 10 మంది విద్యార్థు లు ప్రతిష్టాత్మక ’బ్లాక్ బెల్ట్’ సాధించగా, మ రో ముగ్గురు విద్యార్థులు ’బ్రౌన్ బెల్ట్’ కైవసం చేసుకున్నట్లు ఒకినావా మార్షల్ ఆర ట్స్ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత్ కుమార్ వెల్లడించారు.

పోలీస్ కమిషనర్ కరాటే గ్రేడింగ్లో ఘన విజయం సాధించిన వేములవాడ వి ద్యార్థులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించా రు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్ర స్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ విద్య లు ఎంతో అవసరమన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా యువతలో క్రమశిక్షణ, శా రీరక ఆరోగ్యం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని ఆయన కొనియాడారు. విద్యార్థులు ఇలాగే రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో కరాటే మాస్టర్లు, శిక్షకులు పుల్లూరి శ్రీనివాస్, మరిపల్లి శ్రీనివాస్, కనికరపు రాజశేఖర్, కే. రాజశేఖర్ తదితరులు పాల్గొని వి ద్యార్థులకు సర్టిఫికెట్లు, బెల్టులను అందజేసి అభినందనలు తెలిపారు.