తాగునీటి సమస్యకు చెక్
ఎమ్మెల్యే చొరవతో మంచినీటి బోరు ఏర్పాటు
కరకగూడెం, మే 31 (విజయక్రాంతి) : మండలంలొని రఘునాథపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నర్సంపేట కాలనీలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్ట్యా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో మంజూరైన నూతన బోరు పనులను సర్పంచ్ పోలేబోయిన రాణి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొని మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన తాగునీటి సౌకర్యాలను కల్పించడంలో ఎమ్మెల్యే ఎల్లప్పుడూ ముందుంటారని, గ్రామాల అభివృద్ధి ,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొప్పు కాంతారావు ,తాటిగూడెం ఉపసర్పంచ్ గాంధర్ల రామనాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






