11-02-2026 12:00:00 AM
వేములవాడ, ఫిబ్రవరి10,(విజయక్రాంతి) మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వేములవాడ ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈఓ) రమాదేవి మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ లను కూడా కలిసి జాతర మహోత్సవాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేసిన వేళ వేములవాడ ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు సమర్పించారు. మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న జాతర ఏర్పాట్లు వైభవంగా కొనసాగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.