9 April, 2026 | 4:19 AM

మూతపడిన పశువైద్యశాల.. మూగజీవాల అరణ్యరోదన

09-04-2026 01:33 AM

తాండూరు, ఏప్రిల్ 8, (విజయ క్రాంతి) : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఉన్న పశు వైద్యశాల మూతపడింది. సిబ్బంది ఉన్నా కూడా ఎవరు అందుబాటులో ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు చూసిన పశు వైద్యశాల కు తాళం వేసే ఉంటుందని రైతులు ఆరోపిస్తున్నారు.

పశువులకు సమయానికి చికిత్సలు అందకపోవడంతో రైతులు ప్రైవేట్ పశు వైద్యులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. 2003 సంవత్సరంలో అప్పటి తాండూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి పశు వైద్యశాల సొంత భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో సిబ్బంది అందుబాటులో ఉండి పశువులకు చికిత్సలు అందించారు. అనంతరం సిబ్బంది తరచూ విధులకు గైర్హాజరు అవుతూ మూతపడే దశకు చేరుకుంది. 

 ఎప్పుడు చూసినా పశువైద్యశాలకు తాళం.. 

 సిబ్బంది ఉన్నా కూడా ఎప్పుడు చూసినా పశువైద్యశాలకు తాళం వేసిందే ఉంటుంది. దీంతో ప్రాంగణంలో పిచ్చి చెట్లు, గడ్డి  మొలచి ఏపుగా పెరిగాయి. పశువులకు గాలి కుంటూ వ్యాధుల బారిన పడుతున్నాయి ఏ వ్యాధి సోకిన చికిత్స కోసం ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నాం. 

ఈ విషయమై పశుసంవర్ధక శాఖ జెడి, సదానందం ను వివరణ కోరగా తట్టేపల్లి పశువైద్యశాలకు సిబ్బంది ఉన్నారని. ఎందుకు మూతపడిందో నా దృష్టికి రాలేదు. విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. మూగజీవాలకు చికిత్సలు అందేలా చూస్తాం.

అయినెల్లి చంద్రప్ప, రైతు, తట్టేపల్లి.