23 March, 2026 | 2:14 PM

బాలికకు వీడియో కాల్స్

25-09-2024 03:26 AM

నిందితుడి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): నగరంలోని బండ్లగూడకు చెందిన ఓ మైనర్ బాలికకు స్నాప్‌చాట్ ద్వారా వీడియో కాల్స్ చేసిన అఖీలుద్దీన్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్  పోలీసులు అరెస్ట్  చేశా రు. అతనిపై  పోక్సో కేసు నమోదు చేశారు. సైబర్ క్రైం డీసీపీ డి.కవిత తెలిపిన ప్రకారం..  నగరంలోని అమన్‌నగర్ తలాబ్‌కట్టకు చెందిన అఖీలు ద్దీన్  నగరానికి చెందిన ఓ బాలికకు వీడియో కాల్స్ చేస్తున్నాడు.

నగ్న వీడియోలను సర్క్యులేట్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచగా, కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.