6 May, 2026 | 6:05 PM

వీడీ14 మొదలెట్టేశారు!

03-09-2025 12:37 AM

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘కింగ్‌డమ్’ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసింతే. అయితే, ఈ రౌడీ హీరో తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఒకదాన్ని తాజాగా ప్రారంభించేశారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందు తున్న తాజా ప్రాజెక్ట్ ‘వీడీ14’. రాహుల్ సంకృత్యాన్ దీనికి దర్శకుడు. రాహుల్ గతంలో విజయ్ దేవ రకొండతో కలిసి ‘టాక్సీవాలా’ చిత్రాన్ని రూపొందించి మంచి విజయాన్ని సాధించారు.

ఇప్పు డు ‘వీడీ 14’ అనే వర్కింగ్ టైటి ల్‌తో ఈ పీరియాడికల్ డ్రామా ను తెరకెక్కిస్తున్నారు. 1854 మధ్య కాలానికి చెందిన ఒక రాజు జీవితం ఆధారంగా రాసు కున్న కథతో ఈ సినిమాను తెరకె క్కిస్తున్నారట. అయితే, ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబా ద్‌లో ప్రారంభమైనట్టు సమాచారం.

తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే చేసి, తర్వాత చిత్ర యూనిట్ రాయలసీమ ప్రాంతానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.