6 May, 2026 | 5:14 PM

వింటేజ్.. స్టైలిష్ ఓజీ

03-09-2025 12:39 AM

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కగా, ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో పవన్ వింటేజ్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ను గంభీరమైన అవతారంలో చూపించిన హంగ్రీ చీతా గ్లింప్స్ అభిమాను ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్‌ను ఢీకొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నట్టు గ్లింప్స్‌తో తెలుస్తోంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; డీవోపీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస; ఎడిటర్: నవీన్ నూలి.