calender_icon.png 3 June, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్ దంత వైద్యశాల కోదాడకు మంచి పేరు తీసుకురావాలి

01-06-2025 10:08:10 PM

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు..

కోదాడ: కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ రాజీవ్ చౌరస్తాలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఆశీస్సులతో ఏర్పాటుచేసిన విజయ్ దంత వైద్యశాలను జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు(District Library Chairman Vangaveeti Rama Rao), ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విజయ్ దంత వైద్యశాల కోదాడకు మంచి పేరు తీసుకరావాలని కోరారు.

ఈ దంత వైద్యశాలలో అడ్వాన్సుడ్  డిజిటల్ ఎక్సరే, రోటరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్, దంతాలకు సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ పేదలకు అందుబాటు ధరలోనే అందిస్తున్నట్లు తెలిపారు. దంత వైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత డెంటల్ చెక్ ప్ నిర్వహించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎర్రమల ప్రవీణ్ కుమార్, కుటుంబ సభ్యులు విజయకుమార్, నాగేంద్ర, నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ లు యరమాల సుశీల బెంజిమెన్, ముండ్ర రంగారావు, అల్సగాని శరభయ్య, మేకల ప్రతాప్, మేకల వెంకట్రావు, ముండ్ర శివరామకృష్ణ, ఏ గురవయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.