11 August, 2026 | 1:18 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

‘విజయక్రాంతి’ రెవల్యూషనరీ పేరు

16-06-2025 02:09 AM
  1. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి కితాబు
  2. దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజంతో మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): దినపత్రికకు ‘విజయక్రాంతి’ అనే రెవల్యూషనరీగా ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌శాఖ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) నేత జయంత్ చౌదరి కితాబునిచ్చారు. ఆదివారం ఆయన అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘విజయక్రాంతిదినపత్రిక చైర్మన్ సీఎల్ రాజంను మర్యాద పూర్వకంగా కలిశారు.

కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని సీఎల్ రాజం సత్కరించారు. ‘టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ’ అనే పుస్తకాన్ని కేంద్రమంత్రికి బహూకరించి దినపత్రిక గురించి వివరించారు. పత్రిక ఆవిర్భావం, పయనం గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  దినపత్రికకు ‘విజయక్రాంతి’ నామకరణం ఎంతో చైతన్యవంతంగా ఉందని, ప్రజల్లో స్ఫూర్తినింపే విధంగా ఉందని కితాబునిచ్చారు.