4 June, 2026 | 2:21 AM

నేటి నుంచి గ్రామసభలు

04-06-2026 01:40 AM

నాలుగు రోజుల పాటు నిర్వహణ

ప్రజలకు పలు అంశాలపై అవగాహన 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కరీంనగర్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4 నుండి ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లాలో 318 గ్రామాలు, కరీంనగర్ కార్పొరేషన్ హుజురాబాద్ జమ్మికుంటా, చొప్పదండి మున్సిపాలిటీ లలో, జగిత్యాల జిల్లా లో 380 గ్రామ పంచాయతీలు, అయిదు మున్సిపాలిటీ లలో, పెద్దపల్లి జిల్లాలో 263 పంచాయతీ లు, రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీ లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 171 గ్రామ పంచాయతీ లు, రెండు మున్సిపాలిటీ ల పరిధిలో గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి.

ఈ నెల 4, 6, 8, 10వ తేదీల్లో సభలను నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న పర్యావరణ కార్యక్రమాలకు అదనంగా ఈ సభలు ఉంటాయి.  ముఖ్యంగా పంట మార్పిడి విధానం, పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల వచ్చే నష్టాలు, నానో యూరియా వినియోగం, మొక్కల పెంపకం, తాగునీటి పరిరక్షణ,  వర్షం నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై ప్రజలకు వివరించనున్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు, పురోగతి తెలియజే సభల ద్వారా తెలియజేస్తారు.లోటు వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహింcచాలని నిర్ణయించారు.రు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాలువల అభివృద్ధి, సాగునీటి పనుల పురోగతిని కూడా గ్రామ సభలలో చర్చించాలని నిర్ణయించారు.నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పై కొంత వ్యతిరేక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ లకు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్వదుకు కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది.రు. నకిలీ విత్తనాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి జిల్లాకు విపత్తు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇందుకోసం విడుదల చేసిన నిధుల వినియోగ ధ్రువపత్రాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ లను ప్రభుత్వం ఆదేశించింది