మంచి నీరు ఇలా... తాగేదెలా
కరీంనగర్, జూన్ 3 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్ దుర్షెడ్ వాసుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందనడానికి భావి చూస్తే అద్దం పడుతుంది. ముఖ్యంగా దుర్షేడు వాసులకు త్రాగునీటి కష్టాలు నెలకొని ఉన్నాయి. డివిజన్లో మూడు వాటర్ ట్యాంకులు ఉంటాయి ఆ ట్యాంకులకు బావి నుండి నీరు సరఫరా అవుతుంది.
త్రాగు నీరంధించే.. ఉన్న ఒక్క బావికూడ నిర్వహాన లేక అపరిశుభ్రంగా మారింది.బావి పైన కప్పు లేకుండా చెత్త చేదారంతో నిండి మురికికుపంగా మారింది.మరో వైపు ఆబావి ఎగువ భాగంలో స్మశానం ఉండడంతో పాటు.. ప్రక్కనే వాగు పారుతూ ఉంటుంది. ఐతే.. స్మశానంలో వదిలివేసిన చెత్త గాలిధ్వార మొత్తము బావిలో పడిపోతుంది. మూగ జీవాల కలేబెరాలను వాగులో వేయడం ధ్వారా ఆనీరు కలుషితంగా మారే అవకాశం లేక పోలేదు.. కనీసం బావిలో బ్లీచింగ్ పొడి చల్లే నాథుడే లేడని డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొన్ని వార్డుల్లో బోర్ల రిపేర్లు కూడా ఉన్నాయి. ఓక బోర్ వేసి ప్రజలకు త్రాగు నీరు అందించాలని.. దాంతో పాటు, ఈ బావికి పై కప్పు వేసి..సరియగు నిర్వహాణ చేస్తూ.. ప్రజలకు శుద్ధమైన త్రాగు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. అదే కాకుండా గేట్ వాల్ లీకేజీ తో నీరు కలుషితం అవుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డివిజన్ లో కొన్ని బోర్లు పనిచేస్తలేవు ఈ ప్రాంతం నగర పాలక సంస్థలో విలీనం కాకముందు గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో పంచాయతీ కార్యదర్శికి దృష్టి కి తీసుక వెళ్తే వెంటనే సమస్య కు పరిష్కారం దొరకేదని కానీ ఇప్పుడు సమస్యలను ఎవరికీ చెప్పాలో అర్థం కావటం లేదు. ఇప్పటికైనా డివిజన్ ఆఫీసులో ముఖ్యమైన అధికారి ఫోన్ నెంబర్ రాసి పెట్టాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
సానిటేషన్ కి ఒక ఆఫీసర్, ఎలక్ట్రికల్ కి ఒక ఆఫీసర్ మంచినీటికి ఒక ఆఫీసర్ ఇలా పలు విభగాలకు అధికారులు ఉండడం వల్ల సామాన్య ప్రజలకు ఏమి అర్థం కాకుండా ఎవరికి ఫోన్ చేయాలో అర్థం అవుతలేదులేదని అందువల్ల ఒక అధికారికి సమస్య చెప్పే విదంగా ఒక నంబర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటి కైన అధికారులు స్పందించి.. తగు చర్యలు తీస్కోవాలని కోరుతున్నారు. లేకుంటే ప్రజలు కలుషితం ఐన నీరు త్రాగి రోగాల బారిన పడే అవకాశం. ఉందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






