5 May, 2026 | 5:34 PM

ఏసీబీకి పట్టుబడిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

05-05-2026 04:23 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వెల్జాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎం శరత్ విధులు నిర్వహిస్తున్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం అనుమతి కోసం వచ్చిన బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యదర్శి డబ్బులను స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.