6 July, 2026 | 9:19 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

ఘనాపూర్ లో రెవెన్యూ సదస్సులను అడ్డుకున్న గ్రామస్తులు..

16-06-2025 07:50 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం ఘనపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును గ్రామస్తులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం అధికారులు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్న స్థలం వద్దకు గ్రామస్తులు చేరుకొని గందరగోళం సృష్టించారు. గతంలో 441 సర్వే నంబర్ లో పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది, కానీ గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ నిర్మాణాల పేరిట భూములను తీసుకొని సరైన స్థాయిలో నష్టపరిహారాన్ని ఇవ్వలేదని నిలదీశారు. తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరినారు, గతంలో ఎమ్మార్వో కు, ఆర్ డి ఓ కు భూమిని కోల్పోయిన బాధితులు నష్టపరిహారం ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించిన అధికారులు ఏ కోశాన పట్టించుకోలేదని వారన్నారు. మాకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని గ్రామస్తులు హెచ్చరించారు.