సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..
తూప్రాన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమును కోరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం సహాయనిధి పథకం ఎంతో దోహదపడుతుందని దీనితో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపద సమయంలో ఆపన్న హస్తంగా ఉపయోగపడుతుందని గుండ్రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) సహాయ సహకారాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు పత్రాలను తీసుకోవడం జరిగిందని రాజిరెడ్డి అన్నారు, ఇందులో భాగంగా అనారోగ్య పరిస్థితుల్లో సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మన్నె సాయిలు 60 వెయ్యిలు, తలారి దశరథకు 36 వెయ్యిలు మంజూరైయ్యాయి, ఈ సహాయనిది చెక్కులను గ్రామ పెద్దల సమక్షంలో రాజిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇందులో బిఆర్ఎస్ నాయకులు ప్రశాంత్, మన్నె కృష్ణ, పవన్, చింతల రవి, శేఖర్, వెంకటేశం, మన్నె ప్రవీణ్ ఉన్నారు.






