8 June, 2026 | 10:42 PM

ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి

08-06-2026 09:34 PM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయ క్రాంతి): రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ట్రైనర్ ఎండీ నుమాన్ ముఖ్య అతిథిగా హాజరై బూత్ స్థాయి కార్యకర్తలకు సమగ్రంగా శిక్షణ అందించారు.

ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి బూత్‌లో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల సమస్యలను గుర్తించి పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీకి మరింత మద్దతు సాధించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు.