16 March, 2026 | 3:34 PM

Breaking News

మంథని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం   •   తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ   •   చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి   •   అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు   •   రాష్ట్రం అప్పుల్లో ఉంది..పైసలు లేక ప్రాజెక్టులు ముందుకు పోతలే   •   యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •  

క్రషర్లు, క్వారీలపై గ్రామస్థుల పోరాటం

15-07-2024 12:35 AM

మాదారం పోరాట కమిటీ జేఏసీ ఏర్పాటు

పటాన్‌చెరు, జూలై 14: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని మాదారం గ్రామస్తులు క్రషర్లు, క్వారీలపై పోరాటానికి సిద్ధమయ్యారు. మాదారం పోరాట కమిటీ జేఏసీని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సమావేశమైన గ్రామస్థులు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్ విజయ్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా ఆరేందర్‌గౌడ్, భాస్కర్ యాదవ్, ప్రధాన కార్యదర్శులుగా రమణసింగ్, అనీల్‌కుమార్, ట్రెజరర్‌లుగా మహేందర్‌గౌడ్, గణేశ్, చీఫ్ అడ్వైజర్‌లుగా మహేశ్, వీరేశ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా శ్రీనివాస్, నర్సింగ్‌రావు, అంబదాసు, బాలేశ్, బాబు, ప్రసాద్, పాండు, కాసాల రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయు లు పాల్గొన్నారు. కాగా మాదారం గ్రా మ పంచాయతీ పరిధిలోని క్రషర్లు, క్వారీలను శాశ్వతంగా మూసివేయడమే లక్ష్యంగా కమిటీ పని చేస్తుందని, పోరాటానికి కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాలు చేస్తామని తెలిపారు.