12 June, 2026 | 2:04 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి

12-06-2026 01:29 PM

మల్లాపూర్, జూన్ 12(విజయక్రాంతి): మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 4, 5 వార్డుల్లో పందుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన కుంట రాజు గౌడ్ గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రంలో 4, 5 వార్డుల్లో పందులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. పలుమార్లు వృద్ధులు, చిన్నారులపై పందులు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పందులు ఇండ్ల సమీపంలో స్వైర విహారం చేయడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి, సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి పందుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.