15 April, 2026 | 6:47 AM

పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

23-02-2026 09:49 PM

సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం

చిట్యాల,(విజయక్రాంతి): పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని  రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తెలిపారు. సోమవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని రైతు వేదికలో రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన 

ఆయన మాట్లాడుతూ 2018 పంచాయతీ రాజు చట్టం గురించి  గ్రామాల యొక్క విధులు, నిధుల గురించి గ్రామాల్లో అనుసరించాల్సిన విధివిధానాల గురించి వివరిస్తూ, పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీఓ  కోటయ్య, గుండ్రంపల్లి సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పంచాయతీ సెక్రెటరీ కృష్ణయ్య, టిఓపిలు పాల్గొని వారి యొక్క విధులు నిధుల గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.