calender_icon.png 23 February, 2026 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం!!

23-02-2026 09:53:09 PM

నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని ఉసిరికపల్లి గ్రామపంచాయతీ కి చెందిన వడ్ల అశోక్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన నర్సాపూర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.  ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కల నెరవేర్చుకొని సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, పిఎసిఎస్ తాజా  మాజీ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి  లక్ష్మీకాంతారావు, నర్సాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం, పోతారం సర్పంచ్ మహేందర్, శేఖర్ గౌడ్ బిక్షపతి, కృష్ణ, లక్ష్మీనారాయణ   కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.