19-02-2026 02:13:41 AM
హాజరైన కర్ణాటక మంత్రి ఈశ్వర్
జహీరాబాద్, ఫిబ్రవరి 18: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి విమాన రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పాల్గొన్నారు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, జహీ రాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత పాటిల్, ఝరాసంగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు మల్లికార్జున్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి కళ్యాణోత్సవం విమాన రథోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి కర్ణాటక రాష్ట్రం అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ శాలువా, పూలమాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హనుమంతు, ఝరాసంగం ఎస్త్స్ర పాటిల్ క్రాంతికుమార్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.