28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నేటి నుంచి మల్లికార్జున స్వామి జాతర

19-02-2026 02:11 AM

మునిపల్లి, ఫిబ్రవరి 18: మండల పరిధిలోని కంకోల్ - మొగ్దుంపల్లి గ్రామాల సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ జాతరోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డికి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిలకు ఆహ్వాన పత్రికను బుధవారం బీజేపీ మండల కమిటీ అందించింది. అలాగే స్వామివారి ఆలయ ప్రతిష్టాపన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వా మివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగిశెట్టి, జిల్లా నాయకుడు రామ్ రఘు, గ్రామ పెద్దలు చంద్రశేఖర్ పటేల్, రాచన్న తదితరులు పాల్గొన్నారు.