5 August, 2026 | 8:33 AM

గణేషుడి శోభా యాత్రకు అమిత్ షా

03-09-2025 12:00 AM
  1.   6న హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి
  2. చార్మినార్, ఎంజే మార్కెట్ వద్ద ప్రసంగం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు  ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కా నున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 6న నగరానికి రానున్నారు. శోభాయాత్రలో పాల్గొనడంతో పాటు, పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు అమిత్ షా బేగంపే ట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్తారు. అక్కడ ఉదయం 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై, రాష్ర్టంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట కు చార్మినార్ వద్దకు చేరుకుని అక్కడ ప్రారంభమయ్యే గణేశ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యా హ్నం 3:30 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద జరిగే వేడుకల్లో పాల్గొని, భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.