26 April, 2026 | 10:49 AM

సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే

28-04-2024 01:44 AM

l ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరమని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దాడులకు బాధ్యులైన వారికి ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం రెండేళ్ల జైలుతో పాటు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తా మన్నారు. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచే వసూలు చేస్తామన్నారు. ఇటీవల వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాములుపై నవా జ్ అనే వ్యక్తి దాడికి దిగిన విషయాన్ని ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంది.