జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వినోద్ చారి

15-09-2026 | 10:10pm

వాంకిడి,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్(Telangana Rakshana Sena) అధ్యక్షుడిగా కిరిమిల్ల వినోద్ చారిని పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నియమించారు. ఈ సందర్భంగా వినోద్ చారి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఆయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు