calender_icon.png 13 September, 2024 | 1:44 AM

వైసీపీ భూ ఆక్రమణలపై విశాఖ ఫైల్స్

15-07-2024 12:10:00 AM

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : విశాఖపట్నంలో గత వైసీపీ నాయకులు చేసిన భూ దందాపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ‘విశాఖ ఫైల్స్’ విడుదల చేస్తామన్నా రు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. విశాఖ అభివృద్దిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.