26 February, 2026 | 10:00 PM

థ్రిల్ పంచే మిస్‌టీరియస్

16-12-2025 01:51 AM

రోహిత్ హీరోగా అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన  సినిమా ‘మిస్‌టీరియస్’. రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పతాకంపై జయ్ వల్లందాస్ నిర్మించారు. బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి తదితరులు ముఖ్యతారాగణంగా ఉన్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం: ఎమ్‌ఎల్ రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి. ఈ సినిమా ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. “నేను యూఎస్‌లో ఉంటా. సినిమా రంగంపై ఆసక్తితో టాలీవుడ్‌కు వచ్చా. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో ‘మిస్‌టీరియస్’ చిత్రాన్ని నిర్మించా. మహి చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది. తొలి ప్రయత్నంలో ఒక కథా బలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించడం సంతృప్తిగా ఉంది.

మా సినిమాను ఈ నెల 12నే విడుదల చేయాల్సి ఉంది. అఖండ2 రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా తీసుకొస్తున్నాం. 150కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. సినిమా ఇన్నోవేటివ్ స్క్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుంది. సినిమాలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా అనిపిస్తుంది” అన్నారు.