calender_icon.png 2 November, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వజనని సేవా రత్న అవార్డు

01-11-2025 07:48:38 PM

కోదాడ: హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని  విశ్వజనని ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకల్లో సమాచార హక్కు సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ళపల్లి లక్ష్మణ్ విశ్వజనని సేవారత్న అవార్డును తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ దేశాల భూపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. లక్ష్మణ్ శనివారం మాట్లాడుతూ, సమాజంలో సేవలు చేసే వారిని గుర్తించి, అవార్డు రూపంలో ప్రోత్సహించడం వారి సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సహకంగా ఉంటుందని, ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు సందర్భంగా లక్ష్మణ్ కు పలువురు నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు అభినందనలు తెలిపారు