01-11-2025 07:56:03 PM
అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడెం గుట్టపైన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం కావడంతో భక్తులు రోజు పోటెత్తుతున్నారు. అందులో భాగంగా శనివారం ఏకాదశి కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ఉదయం లక్ష పుష్పార్చన ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా అర్చకులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా మాట్లాడుతూ... కార్తీక మాసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుమన్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు, భక్తులు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.