దుర్గం చెరువుకు రెండు రోజులు తాళం!

11-09-2026 | 04:25am

హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్బి పనుల నేపథ్యంలో సందర్శకుల ప్రవేశం నిలిపివేత

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సైబరాబాద్ లో ప్రముఖ వినోద, పర్యాటక కేంద్రంగా నిలిచిన దుర్గం చెరువుకు గురువారం, శుక్రవారం రోజుల్లో సందర్శకుల ప్రవేశం నిలిపివేయబడింది. సదుపాయాలను మెరుగుపరచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(Hyderabad Metropolitan Water Supply & Sewerage Board) చేపట్టిన నిర్వహణ పనుల నేపథ్యంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10,11 తేదీల్లో చెరువు ప్రాంగణంలోకి ప్రజల ప్రవేశం తాత్కాలికంగా నిషేధించినట్లు సీఎంసీ ప్రకటించింది.

ఈ రెండు రోజులు బోటింగ్, వాక్వే, ఇతర సందర్శన సౌకర్యాలు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. సిఎంసి ప్రజలకు విడుదల చే సిన సూచనలో సందర్శకులు ఈ విషయా న్ని గమనించి, ఆయా తేదీల్లో దుర్గం చెరువు ప్రాంగణానికి రావడం నివారించి,తమ సం దర్శనను తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.వారాంతాల్లో పెద్ద సం ఖ్యలో జనం తరలివచ్చే ఈ చెరువు వద్ద గు రువారం సాయంత్రం నుంచే ప్రవేశ నియంత్రణ అమల్లోకి వచ్చినట్లు సమాచారం.12వ తేదీ నుంచి తిరిగి తెరుచుకుంటుందో లేదో అధికారిక నిర్ధారణ కోసం సీఎంసీ,హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.


మరిన్ని వార్తలు