calender_icon.png 12 January, 2026 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకనందుని మాట..ఏబీవీపీ బాట

10-01-2026 12:00:00 AM

డిచ్‌పల్లి, జనవరి9 (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ బి.శివ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచంలోనే  భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచ వేదికగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టిన వ్యక్తి అని అన్నారు.

వివేకానంద యువతకు ఎంతో ఆదర్శమని అందుకే జనవరి 12వ రోజున అతని జన్మదిన సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారని, యువతకంతా ఒక దిక్సూచి, ఆదర్శ మని అన్నారు. స్వామి వివేకానంద ఇనుప కండరాలు ఒక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన  వంద మంది యువకులను ఇస్తే దేశ భవిష్యత్తు మారుస్తా అన్న వ్యక్తి అని, యువత సన్మార్గంలో మంచి బాటలో నడవలన్నారు.

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి దేశాన్ని ప్రపంచ స్థాయిలో విశ్వగురు స్థానంలో కోరుకున్న వ్యక్తి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి, ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, అధ్యక్షులు పృద్వి, యూనివర్సిటీ కార్యదర్శి సమీర్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు మనోజ్, జాయింట్ సెక్రెటరీ అనిల్ నాయకులు మోహన్ అజేందర్, మహర్షి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.