10-01-2026 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ వాన్
కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): సాహిత్యం ప్రజల జీవన విధానాన్ని వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోటలో ఆధునిక తెలంగాణ సాహిత్యం సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక తెలంగాణ సాహిత్యంపై సమాలోచన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ, వెలుగులోకి వచ్చిన సాహిత్యం ప్రజల జీవన విధానాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆధునిక తెలంగాణ సాహిత్యం సమాజంలో మార్పుకు దోహదపడుతూ, నూతన తరానికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. సాహిత్య సృష్టికర్తలు సామాజిక బాధ్యతతో రచనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సాహిత్య ప్రాధాన్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను సాహితీ వేత్తలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.