29 July, 2026 | 6:03 PM

Breaking News

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •   భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి   •  

ఉద్యోగ భద్రత కల్పించాలని వీవోఏల నిరవధిక సమ్మె

26-05-2026 01:15 AM

రుద్రంగి మే 25(విజయక్రాంతి)ఉద్యోగ భద్రత కావాలని రుద్రంగి మండల కేంద్రంలో ఐకేపీ వివోఏ లు నిరవధిక సమ్మెను చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు గౌరవ వేతనం వద్దు,కనీస వేతనం 20 వేలు ఇవ్వాలి,సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలి,అర్హులైన వివోఏ లకు సీసీ లుగా పదోన్నతి కల్పించాలి,సాధారణ ఆరోగ్య భీమా (20 లక్షల) వరకు భద్రత కల్పించాలి,పని భారం తగ్గించి వివోఏ లకు ట్యాబ్ లు నెట్ సౌకర్యం కల్పించి,జీవో నెంబర్ 58 ను సవరించాలని మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఐకేపీ వివోఏ ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు చేపట్టామని అన్నారు.డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వివోఏ లు పాల్గొన్నారు.