15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి

18-05-2025 04:37 PM

సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మండల మహిళా సమైక్యలో అటెండర్స్ గా 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18 వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల మహిళా సమైక్య అటెండర్స్ జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... మండల మహిళ సమైక్య లు ఏర్పడిన నాటి నుండి 20 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనేక రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో అటెండర్స్ కి 2 వేలు నుండి 6 వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కూరెళ్ల యాదగిరి, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, గుండు సైదమ్మ, బి మణమ్మ, పి మణమ్మ, తదితరులు పాల్గొన్నారు.