calender_icon.png 18 May, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు కిట్ల పంపిణీ

18-05-2025 04:25:24 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): చౌడమళ్ళ కృష్ణకుమారి స్మారకార్థం భర్త సారయ్య, కుమారుడు భాను కిరణ్ 10000 రూపాయలతో క్రీడాకారులకు కిట్ల పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారులకు పదివేల రూపాయలతో హాకీ స్టిక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హుజురాబాద్లో హాకీ క్రీడకు పెట్టింది పేరని అన్నారు. నిత్యం మైదానంలో సుమారు 70 మంది పిల్లలు శిక్షణ పొందడం గర్వకారణం అని సారయ్య కొనియాడారు.

అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ.. నిత్యం హాకీ క్రీడాకారులకి అరటి పండ్లు కోడిగుడ్లు అందించడం సంతోషకరమని అన్నారు. చౌడమల సారయ్య వారి భార్య జ్ఞాపకార్థం హాకీ స్టిక్స్ పంపిణీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రవీందర్రావు, సీనియర్ క్రీడాకారులు బండ రఘు, భూసరపు శంకర్, పీటి రవికుమార్, శ్యామ్, రాజు, రాజేష్, సాయికృష్ణ, విక్రం, నరేష్, రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.