18-05-2025 04:44:57 PM
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శ్రీ భక్తాంజనేయ హనుమాన్ మండలి ఆధ్వర్యంలో హనుమాన్ మాలా దిక్షాదారులు హనుమాన్ సంకీర్తనలు, చాలీసా పారాయణం చేస్తూ ఆదివారం వైభవంగా నగర సంకీర్తన నిర్వహించారు. తొలుత ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేకం నిర్వహించి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరు గంటల పాటు పుర వీధులలో శ్రీరామ జయరామ జయజయరామ, జయ శ్రీ హనుమ జయ జయ హనుమ అంటూ చేసిన ఆంజనేయస్వామి స్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గురు స్వామి వంగ కుమారస్వామి యాదవ్, ముత్యం లింగయ్య, గొర్రె భాస్కర్, భాష బోయిన మల్లికార్జున్, నూతి రమేష్, రాసపల్లి కుమారస్వామి, వంగ నగేష్, గొర్రె కుమారస్వామి, మంగ గోపాల్, భాష బోయిన అశోక్, వెంగళ భూమరాజు, భాష బోయిన అభిషేక్, వీరస్వామి, రాజు నాయక్ , దేవేందర్, గంజి రాజు, తిరుపతి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.